కళ్యాణ్ రామ్ తో దిల్ రాజు

చాలా కాలం నుంచీ హీరో కళ్యాణ్  రామ్ స్వంత సినిమాలు తప్ప, బయటి సినిమాలు చేయలేదు. కళ్యాణ్ రామ్ స్నేహశీలి, మంచి వ్యక్తిత్వం కలవాడు అని అందరూ అంటారు. కానీ బయటి నిర్మాతలు మాత్రం…

చాలా కాలం నుంచీ హీరో కళ్యాణ్  రామ్ స్వంత సినిమాలు తప్ప, బయటి సినిమాలు చేయలేదు. కళ్యాణ్ రామ్ స్నేహశీలి, మంచి వ్యక్తిత్వం కలవాడు అని అందరూ అంటారు. కానీ బయటి నిర్మాతలు మాత్రం అతనితో సినిమాలు చేయడం లేదు. పటాస్ సినిమాతో దిల్ రాజుతో ఫ్రెండ్ షిప్ కుదిరింది. 

ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ కలిపాడు ఇద్దరిని. అక్కడ కలిసింది ఫెవికాల్ బంధం. ఇప్పుడు దిల్ రాజు, త్వరలో ఓ సినిమా చేయబోతున్నాడు. దాంట్లో కళ్యాణ్ రామ్ నే హీరో. దీనికి దర్శకుడు ఎవరో కాదు. మెగా కుర్రాడు సాయి ధరమ్ తేజ ను సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేసిన కెఎస్ రవికుమార్ చౌదరి. త్వరలో మిగిలిన వివరాలు అన్నీ ఫైనల్ అవుతాయి.