మొత్తానికి ఒకటవ తేదీ రేస్ నుంచి ఓ సినిమా వెనక్కు తప్పుకుంది. దాగుడు మూతలు దండాకోర్ సినిమా వెనక్కు వెళ్లింది. అయితే ఎనిమిదినా లేక తోమ్మిదినా అన్నది ఇంకా ఖరారు కాలేదు.
Advertisement
ఎందుకంటే లయన్ తొ సమస్యగా వుంది. లయన్ విడుదలకు ఒక్క రోజు వెనుకగానే రావాలన్నది రామోజీ ఆలోచనగా వుంది. అందుకే లయన్ 7న అయితే దాగుడుమూతలు 8న, లేదా అది 8న అయితే ఇది 9న విడుదలవుతాయి.
ఇక గంగ ఇంకా మునిగి తేలుతూనే వుంది. 1 న వస్తుందా అన్నది అనుమానంగానే వుంది. అది కూడా 8కి వెళ్తే ఇక ఫైట్ పెద్ద సినిమా ఉత్తమ విలన్ కు, చిన్న సినిమా దొంగాటకు నడుమే వుంటుంది.