గంగ సినిమా ఎలా వుందో తెలియదు కానీ, తమిళనాట హిట్ అన్నది మాత్రం వైరస్ లా పాకిపోయింది. అందుకే ఎలాగైనా దాన్ని విడుదల చేయాలని నిర్మాత బెల్లంకొండ, నైజాం ఏరియాకు దాని పంపణీ బాధ్యతలు తీసుకున్న దిల్ రాజు కిందామీదా పడుతున్నారు.
ఇదిలా వుంటే తెలుగు ప్రేక్షకులు కూడా గంగపై బాగానే ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో చెన్నయ్ నుంచి మెల్లగా తమిళ గంగ మొబైళ్లలోకి వచ్చేసిందని తెలుస్తోంది. భాష రాకున్నా మొబైళ్లలో గంగ సీన్లు చూసేసి ఆనందిస్తున్నారు జనాలని విశాఖలో టాక్ వినిపిస్తోంది.
అయితే తమిళం కాదు తెలుగే అని కొందరు అంటున్నారు కానీ అది నిజం కాదని తెలుస్తోంది. తమిళ వెర్షన్ మాత్రం మొబైళ్లలోకి వచ్చిందని చూసిన వారు చెబుతున్నారు.