చిరు కోసం క‌థ రాశాడ‌ట‌

కొత్తబంగారు లోకం, సీత‌మ్మ వాకిట్లో.. ముకుంద సినిమాల‌తో క్లాస్ ద‌ర్శకుడ‌నే ముద్రని శాశ్వతం చేసుకొన్నాడు శ్రీ‌కాంత్ అడ్డాల. ఇప్పుడు మ‌హేష్ బాబుతో బ్రహ్మోత్సవం సినిమాని రూపొందించే ప‌నిలో ఉన్నాడు.   Advertisement అయితే చిరంజీవి…

కొత్తబంగారు లోకం, సీత‌మ్మ వాకిట్లో.. ముకుంద సినిమాల‌తో క్లాస్ ద‌ర్శకుడ‌నే ముద్రని శాశ్వతం చేసుకొన్నాడు శ్రీ‌కాంత్ అడ్డాల. ఇప్పుడు మ‌హేష్ బాబుతో బ్రహ్మోత్సవం సినిమాని రూపొందించే ప‌నిలో ఉన్నాడు.  

అయితే చిరంజీవి కోసం శ్రీ‌కాంత్ ఓ క‌థ సిద్ధం చేశాడ‌ట‌. అవ‌కాశం ఇస్తే.. వినిపిస్తా అంటున్నాడు. చిరంజీవి 150వ సినిమా కోసం గ‌త కొంత‌కాలంగా క‌థ‌లు వింటున్నారు. అయితే ఈమ‌ధ్య ఓ క‌థ ఫిక్స్ చేశారు కూడా. 

అయితే ఇప్పుడు శ్రీ‌కాంత్ అడ్డాల కూడా రేసులో రావ‌డానికి ప్రయ‌త్నిస్తున్నాడ‌న్నమాట‌. చిరు 150వ సినిమాకి అవ‌కాశం రాక‌పోయినా… ఎప్పటికైనా చిరుని డైరెక్ట్ చేసే ఆలోచ‌న మాత్రం శ్రీ‌కాంత్ కి ఉన్నట్టు అర్థమ‌వుతోంది. బ్రహ్మోత్సవం హిట్టయితే.. మ‌ళ్లీ శ్రీ‌కాంత్‌కి మెగా కాంపౌండ్ నుంచి పిలుపు వ‌స్తుందేమో..?.