సన్నాఫ్ సత్యమూర్తి తరవాత అల్లు అర్జున్ సినిమా బోయపాటి శ్రీనుతోనే. ఇది ఫిక్సయ్యింది. బన్నీకి సరిపడే లైన్ ఒకటి రెడీ చేసి మెప్పించిన బోయపాటి… ఇప్పుడు పూర్తి స్థాయిలో స్ర్కిప్టు సిద్ధం చేసి బన్నీచేత ఆమోద ముద్రకూడా వేయించేశాడని టాక్.
ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్సులు ఇచ్చిపుచ్చుకోవడం, ఎగ్రిమెంట్లు కుదుర్చుకోవడం కూడా పూర్తయిపోయాయి. మార్చి నుంచి ఈ సినిమా మొదలెట్టేస్తారట. అంటే… బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా పూర్తిగా పక్కకెళ్లిపోయినట్టే. బన్నీ సినిమాకి మధ్య గ్యాప్ దొరికితే అల్లుడు శ్రీనుతో సినిమా పట్టాలెక్కించేద్దామని చూశాడు బోయపాటి.
కానీ బెల్లంకొండ దగ్గర బడ్జెట్ లేకపోవడంతో… బన్నీ సినిమా వీలైనంత త్వరగా మొదలెట్టాలని చూస్తున్నాడు. వీలైనంత త్వరగా బన్నీ సినిమా పూర్తిచేయాలన్నది బోయపాటి లక్ష్యం. మరి బన్నీ సినిమా ఎప్పుడు వదులుతాడో చూడాలి.