రుద్రమదేవి సెప్టెంబర్ 4 బరి లోంచి తప్పుకోవడంతో టపటపా పిట్టలు రాలినట్లు సినిమాలు వచ్చేలా వున్నాయి. ఇప్పటికి డైనమైట్, భలే భలే మగాడివోయ్, జయసూర్య, మరో చిన్న సినిమా ఇప్పటికి రెడీ అయిన జాబితాలో వున్నాయి. హోరా హోరీ కూడా వస్తుందనుకున్నారు కానీ, దాని మేకర్స్ కాస్త జంకుతున్నారు. ఇన్ని సినిమాల మధ్య వదలడమా అని?
ఇదిలా వుంటే మరో రెండు వారాల వరకు సరైన సినిమా పడేలా లేదు. అంటే శ్రీమంతుడు మరి కాస్త డబ్బులు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు వారాల్లో 90 కోట్ల మార్కు దాటుతుందా అన్నది చూడాలి. ఇప్పటికి 75దాకా చేరుకున్నట్లు బోగట్టా. ఇప్పటి నుంచి రోజుకు కోటి వంతున వస్తే, 90 మార్కు దాటేస్తుంది. లాంగ్ రన్ లో వంద కోట్ల షేర్ అన్న టార్గెట్ రీచ్ కావడానికి అవకాశం వుంది. అలాగే రెండు వారాల దాకా సినిమా లేకపోవడంతో, కాస్త ఏవరేజ్ టాక్ వచ్చినా, కిక్ 2 కూడా కాస్త కలెక్షన్లు కళ్ల చూసే అవకాశం వుంది.