చరణ్ టీజర్ అదిరిందిగా

రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ టీజర్ బయటకు వచ్చింది. ఓ రేంజ్ లో వుంది అన్నది చిన్నమాటే. ఆగడు అవమాన భారాన్ని ఎప్పుడు తలమీద నుంచి దింపుకుంటానా అని కసితో వున్నాడు. ఆ కసి…

రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ టీజర్ బయటకు వచ్చింది. ఓ రేంజ్ లో వుంది అన్నది చిన్నమాటే. ఆగడు అవమాన భారాన్ని ఎప్పుడు తలమీద నుంచి దింపుకుంటానా అని కసితో వున్నాడు. ఆ కసి ఈ టీజర్ లో స్పష్టంగా కనిపించింది.

అభిమానులను అలరించే ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను అందించాలన్నప్రయత్నంలో వున్నాడు రామ్ చరణ్. ఆ ప్రయత్నం ఈ టీజర్ లో కనిపించింది. టీజర్ కట్ చాలా పెర్ ఫెక్ట్ గా వుంది. చరణ్ యాక్షన్ స్పీడ్ భలేగా వుంది.

మొత్తం మీద చరణ్ అభిమానులకు, సినిమా అభిమానులకు మాంచి బఫే మీల్స్ రెడీ చేస్తున్నట్లుంది చరణ్-శ్రీను వైట్ల కలిసి.డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా దసరాకు ఎలాగైనా విడుదల చేయాలని యూనిట్ కష్టపడుతోంది. 

Video: Watch Ram Charan – Srinu Vaitla Movie Teaser