చిన్న సినిమాలు నచ్చితే, వెంటనే పార్టనర్ షిప్ తీసుకోవడం దగ్గుబాటి సురేష్ కు అలవాటు. అలా చేరిన సినిమాలు పెద్దహిట్ లు అవుతుంటాయి కూడా. ఉయ్యాల జంపాల సినిమాకు ఇలాగే జాయిన్ అయ్యాడు ఆయన. ఇప్పుడు హోరా హోరీ సినిమాకు పార్టనర్ గా చేరారు.
డిస్ట్రిబ్యూషన్ కోసం సినిమా చూసి, బాగుందని, చెప్పి, తన బ్యానర్ పై ప్రెజెంట్ చేస్తానని ముందుకు వచ్చాడట. ఈ సినిమాను దర్శకుడు తేజ, నిర్మాత దామోదర ప్రసాద్ కలిసి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించారు.
అయితే అవుట్ పుట్ మాత్రం చాలా రిచ్ గా వచ్చింది. దాంతో ఇప్పుడు సురేష్ కూడా పార్టనర్ గా జాయిన్ అయ్యారు. ఈ సినిమా బహుశా సెప్టెంబర్ రెండు, మూడు వారాల్లో విడుదలయ్యే అవకాశం వుంది.