కుర్రాడు రాజ్ తరుణ్ టైమ్ బాగున్నట్లుంది. చేతిలో మూడు సినిమాలు వుండగానే అల్లు అరవింద్ దృష్టిలో పడ్డాడు. తన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఓ సినిమాకు బుక్ చేసేసాడు. నిన్నటికి నిన్న అడ్వాన్స్ చేతిలో పడిపోయింది. ఈ సినిమాకు మున్నా అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తాడు.
సినిమాకు బన్నీవాసు-మారుతి నిర్మాతలుగా వ్యవహరిస్తారు. వరుణ్ సందేశ్ కనుమరుగు అయ్యాడు. ఈ రేంజ్ లో నాగశౌర్య ఒక్కడే కనిపిస్తున్నాడు. ఆపైన సందీప్, నాని, వున్నారు. కుర్రాడు ఈజ్ బాగుండడంతో బాటు రేటు చాలా అందుబాటులో వుండడంతో చకచకా సినిమాలు పడుతున్నాయి.
కానీ ఏది పడితే అది ఓకె అనేయకుండా కాస్త చూసుకోవడం మంచింది. లేదంటే నెంబర్లు కనిపిస్తాయి కానీ హిట్లు కాదు.