ఎన్టీఆర్‌ ఇప్పుడు ఉండనిస్తాడా?

ఎన్టీఆర్‌ సినిమాకి మ్యూజిక్‌ చేసే ఛాన్స్‌ అనూప్‌ రూబెన్స్‌కి ఇంతకుముందే వచ్చింది. రభసకి ముందుగా అనూప్‌నే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా సైన్‌ చేసారు. కొన్ని ట్యూన్స్‌ కూడా రెడీ చేసిన తర్వాత అతని పనితనం నచ్చక…

ఎన్టీఆర్‌ సినిమాకి మ్యూజిక్‌ చేసే ఛాన్స్‌ అనూప్‌ రూబెన్స్‌కి ఇంతకుముందే వచ్చింది. రభసకి ముందుగా అనూప్‌నే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా సైన్‌ చేసారు. కొన్ని ట్యూన్స్‌ కూడా రెడీ చేసిన తర్వాత అతని పనితనం నచ్చక ఎన్టీఆర్‌ అతడిని తమన్‌తో రీప్లేప్‌ చేసాడు. చిన్న సినిమాలకి సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ ఇస్తోన్న అనూప్‌ పెద్ద రేంజ్‌కి చేరుకునే అవకాశం కోల్పోయాడు. 

అయితే ఎన్టీఆర్‌ని మెప్పించడానికి అనూప్‌కి మరో ఛాన్స్‌ దక్కనుందని తెలిసింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటించే చిత్రానికి అనూప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అట. మరి అతడిని ఎన్టీఆర్‌ ఓకే చేసాడా లేదా అనేది ఇంకా తెలీదు. పూరి జగన్నాథ్‌ తన గత చిత్రం హార్ట్‌ ఎటాక్‌కి అనూప్‌తో తనకి నచ్చిన మ్యూజిక్‌ చేయించుకున్నాడు. 

ఈసారి కూడా అతడితో మంచి అవుట్‌పుట్‌ రాబట్టుకుంటానని ఎన్టీఆర్‌ని పూరి కన్విన్స్‌ చేసి ఉండాలి. ఇప్పుడు ఈ ఛాన్స్‌ని సద్వినియోగం చేసుకుంటే అనూప్‌కి ఇదే బిగ్‌ టికెట్‌ మూవీ అవుతుంది. మనంతో అందరి ప్రశంసలు అందుకుంటోన్న అనూప్‌ ఇక అగ్ర పథంలోకి చేరడమే మిగిలింది.