‘ఎలపరం’ సన్నివేశం కోసమే: మహేష్‌

మహేష్‌బాబు తాజా చిత్రం ‘ఆగడు’ విడుదలకు ముందే వివాదాన్ని తెరపైకి తెచ్చింది. టీజర్‌ చూస్తే మొత్తంగా ‘గబ్బర్‌సింగ్‌’ సినిమాని కాపీ కొట్టేసినట్టుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు, ‘సింహాలు, పులులు, ఎలుక..’ అంటూ మహేష్‌…

మహేష్‌బాబు తాజా చిత్రం ‘ఆగడు’ విడుదలకు ముందే వివాదాన్ని తెరపైకి తెచ్చింది. టీజర్‌ చూస్తే మొత్తంగా ‘గబ్బర్‌సింగ్‌’ సినిమాని కాపీ కొట్టేసినట్టుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు, ‘సింహాలు, పులులు, ఎలుక..’ అంటూ మహేష్‌ చెప్పిన డైలాగ్‌ పవన్‌ అభిమానులకి (?!) ఆగ్రహం తెప్పించింది.

‘అత్తారింటికి దారేది’ సినిమాలో ‘నేను సింహం లాంటోడ్ని..’ అనే డైలాగ్‌ చెప్తాడు పవన్‌. అది చాలా పాపులర్‌ అయ్యింది. దానికి కౌంటర్‌గానే మహేష్‌ ‘ఆగడు’లో సింహం డైలాగు వేశాడనే వాదనలు తెరపైకొచ్చాయి. పవన్‌నే ఎందుకు అనుకోవాలి.? ‘ఫ్లూట్‌ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు..’ అని బాలకృష్ణ కూడా సింహం డైలాగు చెప్పాడు కదా.. అలాంటప్పుడు బాలయ్యపై మహేష్‌ సెటైర్‌ అని ఎందుకు అనుకోకూడదు.. అనేవారూ లేకపోలేదు.

ఇలా రకరకాల వాదనలు విన్పిస్తుండడంతో మహేష్‌, ‘ఆగడు’ డైలాగ్‌పై వివరణ ఇచ్చాడు. అదేదో సన్నివేశం కోసం పెట్టిందే తప్ప, జంతువుల మీద చిన్న చూపు లేదు, ఎవర్నీ ఉద్దేశించి ఆ డైలాగూ చెప్పలేదు.. అని స్పష్టం చేశాడు మహేష్‌. దాంతో ఇక్కడికి ఈ వివాదం సద్దుమణిగిందనుకోవాలి.