రజనీకాంత్ ముచ్చటపడి చేసిన యానిమేషన్ సినిమా ‘కొచ్చడయ్యాన్’ మొత్తం అన్ని భాషల్లోను తిరస్కరణకి గురయింది. తమిళ సోదరులు షరా మామూలుగా రజనీ సినిమా అనే సరికి ఆకాశానికి ఎత్తేయాలని చూసారు. విమర్శకులు ఇదొక సాంకేతిక విప్లవమంటూ విశేషణాలతో తమ సమీక్షలు నింపి పారేసారు.
కానీ సగటు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకి అంత సీన్ లేదని తేల్చేసారు. మొదటి రోజే తెలుగు, హిందీలో డిజాస్టర్ అని తేలిపోయిన ఈ చిత్రం తమిళంలోను ఫ్లాప్ అని రుజువు కావడానికి వారం పట్టింది. అయితే ఈ సినిమా ఫ్లాపయినా కానీ రజనీకాంత్ క్రేజ్ అయితే ఏమీ తగ్గలేదు. రజనీకాంత్ యానిమేషన్ సినిమాలకి గిరాకీ లేదు కానీ ఆయన స్వయంగా నటిస్తే ఇప్పటికీ కాసుల పంటే.
అందుకే రజనీకాంత్ నటిస్తోన్న లింగా సినిమా తెలుగు అనువాద హక్కుల్ని ముప్పయ్ కోట్లు ఇచ్చి కొనేందుకు పోటీలు పడుతున్నారు. దర్శకుడు కె.ఎస్. రవికుమార్ ఇప్పుడంత ఫామ్‌లో లేకపోయినా కానీ కేవలం రజనీకాంత్‌ని చూసి ఈ చిత్రానికి భారీ ఆఫర్లతో వస్తున్నారు. తన కూతురు డబ్బు కూడగట్టుకోవాలనుకుంటే.. రజనీ ఆమెకి ఇలా రెగ్యులర్ సినిమా చేసి పెడితే బెటర్ అనుకుంట.