రేసుగుర్రంతో తన రేంజ్‌ని డబుల్ చేసుకున్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం విషయంలో కంగారు పడడం లేదు. త్రివిక్రమ్ ఎంత టైమ్ తీసుకున్నా ఫర్వాలేదని.. అతను తనతో ఒక హిట్ తీస్తే చాలని అల్లు అర్జున్ అనుకుంటున్నాడు. అందుకే ఇంకా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకపోయినా కానీ అతనేం తొందర పడడం లేదు.
ఆగస్టులో కానీ ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లదని ప్రస్తుత సమాచారం. మరి కాస్త ఆలస్యం కూడా జరగవచ్చునని అంటున్నారు. ఇక ఈ టైమ్ వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక రుద్రమదేవి చిత్రంలో స్పెషల్ రోల్ చేయడానికి అల్లు అర్జున్ అంగీకరించాడు. త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అయ్యేలోగా అల్లు అర్జున్‌పై సన్నివేశాలని తెరకెక్కిస్తాడు గుణశేఖర్.
వరుడుతో బన్నీని డిజప్పాయింట్ చేసిన గుణశేఖర్ ‘రుద్రమదేవి’తో తన కెరీర్‌లో మర్చిపోలేని విజయాన్ని, అంతగా గుర్తుండిపోయే పాత్రని అందిస్తానని అంటున్నాడు. ఆచి తూచి సినిమాలు చేసే అల్లు అర్జున్ రుద్రమదేవిలో అడుగు పెట్టడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.