మూస సినిమాలకి పెట్టింది పేరయిన బాలకృష్ణ తన కెరీర్లో అత్యధిక పరాజయాలని గత పది, పదిహేనేళ్లలో చవిచూసాడంటే అందులో ఆశ్చర్యం లేదు. ప్రతి సినిమానీ అదే కథతో చేసే బాలకృష్ణకి ఎప్పుడో కానీ ఫార్ములా సరిగ్గా వర్కవుట్ కాదు. అలా కలిసొచ్చినప్పుడు హిట్స్ వస్తాయి.. లేదంటే డిజాస్టర్స్ అవుతాయి.
ఎన్ని సినిమాలు అవే కథలతో చేసినా కానీ అస్సలు బోర్ ఫీలవకుండా మళ్లీ మళ్లీ అలాంటివే అంగీకరిస్తున్నాడు బాలయ్య. ఒక యంగ్ క్యారెక్టర్.. ఫ్లాష్‌బ్యాక్‌లో ఒక పవర్‌ఫుల్ మాస్ క్యారెక్టర్.. ఇదే ప్రతి సినిమాలోను బాలకృష్ణ ఫార్ములా. ఇప్పుడతను చేస్తోన్న సినిమా కూడా ఇదే కథతో ఉంటుందట. ఇందులోను బాలకృష్ణ ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తాడట.
ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి సినిమాలు చేస్తే జనం ఆదరిస్తారు కానీ అన్నిట్లోను అదే పంథా అంటే మరో నాలుగేళ్ల పాటు బాలకృష్ణ సినిమా చూడరు. వంద సినిమాలకి దగ్గర పడ్డ దశలో ఈ మూస సినిమాలు బాలకృష్ణకి అవసరమా అసలు!