నిర్మాత రామ్మోహన్ కు డైరక్టర్ కావాలని ఎప్పటి నుంచో కోరిక..అష్టాచెమ్మా, ఉయ్యాల జంపాల లాంటి మంచి సినిమాలకు నిర్మాత కన్నా కాస్త ఎక్కువగానే అతని కంట్రిబ్యూషన్ వుంది.
నిజానికి ఉయ్యాల జంపాల తానే డైరక్ట్ చేద్దామనుకున్నాడు కూడా. నాగార్జునతో చేస్తున్న సోగ్గాడే చిన్న నాయన లైన్ అతనే రాసుకున్నాడు..స్క్రీన్ ప్లే అతగాడే సమకూర్చుకున్నాడు. నాగ్ అంత ఆసక్తి కనబర్చకపోవడంతో డైరక్షన్ వదిలేసాడు.
మొత్తానికి ఇప్పుడు ఆ కోరిక తీర్చుకునే రోజు దగ్గరకు వచ్చింది. అవిక గోర్ ను కథానాయికగా తీసుకుని, కొత్త హీరోను పరిచయం చేస్తూ ఓ డీసేంట్ స్మాల్మ్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాడట. చేతిలో వున్న సినిమా ఓ కొలిక్కి వచ్చాక, ఇది సెట్ మీదకు వెళ్తుంది.