బన్నీ-బోయపాటి ‘రథం’ లాగుతారా?

బోయపాటి శీను..బన్నీ సినిమా వ్యవహారాలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. మొదట్లో ఉంటుందా ఉండదా అన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఇక త్వరలొ సెట్ మీదకు కూడా వెళ్లబోతోంది.   Advertisement టైటిళ్లు పెట్టడంలో బోయపాటికి మాంచి పేరుంది.…

బోయపాటి శీను..బన్నీ సినిమా వ్యవహారాలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. మొదట్లో ఉంటుందా ఉండదా అన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఇక త్వరలొ సెట్ మీదకు కూడా వెళ్లబోతోంది.  

టైటిళ్లు పెట్టడంలో బోయపాటికి మాంచి పేరుంది. సింహా..దమ్ము..లెజెండ్..ఇలా. ఇప్పుడు కూడా అలాంటి టైటిల్ ఒకటి అనుకుంటున్నాడని గ్యాసిప్ చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. బన్నీ సినిమాకు రథం అనే టైటిల్ ఫిక్స్ చేసాడు అని ఆ గ్యాసిప్ సారాంశం. 

ఇది మరీ పవర్ ఫుల్ టైటిల్ కాకపోయినా, కాస్త డిఫరెంట్ గా వుందన్నది మాత్రం వాస్తవం,.చూడాలి ఇది మరి వర్కింగ్ టైటిలా వుంటుందో, అసలు టైటిల్ గా మారుతుందో?