కరాటే కళ్యాణి అరెస్ట్‌

రవితేజ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణ’ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. ఆ సినిమాలో బ్రహ్మానందం ‘బాబీ’ అనే కామెడీ క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. బాబీతో రొమాన్స్‌ నడిపే వ్యాంప్‌ పాత్రలో కనిపించిన కరాటే…

రవితేజ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణ’ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. ఆ సినిమాలో బ్రహ్మానందం ‘బాబీ’ అనే కామెడీ క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. బాబీతో రొమాన్స్‌ నడిపే వ్యాంప్‌ పాత్రలో కనిపించిన కరాటే కళ్యాణి ఈ రోజు వార్తల్లోకెక్కింది. పేకాడుతూ పట్టుబడటంతో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో కరాటే కళ్యాణి సహా 11 మంది పేకాడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

సెలబ్రిటీలు మందు కొట్టడం, పేకాట ఆడటం, కొన్ని సందర్భాల్లో డ్రగ్స్‌ తీసుకుంటూ బుక్‌ అవడం చాలా సర్వసాధారణమైన విషయాలే. అయితే సెలబ్రిటీలు కదా.. అరెస్టు వార్తలకి కాస్త మీడియాలో ఎక్కువ చోటు దక్కుతుంది. టీవీ సీరియల్స్‌లో, సినిమాల్లో పాపులర్‌ అయిన కరాటే కళ్యాణిని పక్కా సమాచారంతో పోలీసులు అరెస్ట్‌ చేశారట.

అయితే కరాటే కళ్యాణి మాత్రం షరా మామూలుగానే తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించేశారని వాపోతోంది. మార్కెట్‌లో ‘ప్లేయింగ్‌ కార్డ్స్‌’ విచ్చలవిడిగా దొరుకుతాయి. సరదాకి పేకాడటం నేరం కాదంటారు కొందరు. పేకాట ఏ రూపంలో ఆడినా అది నిబంధనలకు విరుద్ధమేనంటారు పోలీసులు. ఏది వాస్తవం.? ఏది అన్యాయం? అంటే చెప్పలేం. ఇక, అరెస్టు చేసినవారి నుండి 75 వేల రూపాయల నగదు, 8 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారట.