Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రామ్ తోనూ అదే పరేషాన్?

రామ్ తోనూ అదే పరేషాన్?

దోచేయ్ సినిమాలో ఓ డైలాగ్ వుంది. సినిమా ప్రారంభించేటపుడు ఆస్కార్ చూపిస్తారు..తీస్తున్నపుడు నరకం చూపిస్తారు అని..టాలీవుడ్ నిర్మాతల వ్యవహారం అలాగే వుంది. సినిమా ప్రారంభించేటపుడు హీరోకు ఇంతిస్తాం..అంతిస్తాం..అంటారు. తీరా సినిమా పూర్తయ్యే సమయానికి కాళ్లు తేలేస్తారు.

 మొన్నటికి మొన్న టెంపర్ వ్యవహారం అలాగే అయ్యింది. ఎన్టీఆర్ తన అక్కౌంట్ సెటిల్ చేసే వరకు డబ్బింగ్ చెప్పనని కూర్చున్నాడు. ఆఖరికి ఏదో విధంగా సెటిల్ చేసారు. ఇప్పుడు రామ్ వంతు వచ్చినట్లు తెలుస్తోంది. పంగడ చేస్కో సినిమా ఫైనల్ కు వచ్చింది. 

మే 15 డేట్ ఇచ్చేసారు. రామ్ తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు. మరి ఇప్పుడీ టాక్ వినిపిస్తోంది. ఇంకా రెండు వారాలకు పైగా సమయం వుంది కాబట్టి అంత టెన్షన్ పడక్కరలేదేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?