సీరియస్ ,యాక్షన్ సినిమాలు చేసే సురేందర్ రెడ్డి రేసుగుర్రంతో, కామెడీ సీన్లు పండితే కలెక్షన్ల రేంజ్ ఎలా వుంటుందో తెలియవచ్చింది. నిజానికి అలా తెలియ చేసింది అల్లు అరవింద్.
రేసుగుర్రంలో ఫన్ తక్కువ పడిందని, చివర్న బ్రహ్మానందం ఎపిసోడ్ ను చేర్పించింది ఆయనే అని టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో వినిపిస్తుంది. సరే, ఏదయితేనేం అది పండింది. దాంతో ఇప్పుడు కిక్ 2 కూడా అదే ఫార్ములాలో వెళ్లాడట. ఈ విషయం రవితేజే చెప్పాడు.
ఇప్పుడు ఫన్ టేస్ట్ తెలిసింది మా సురేందర్ రెడ్డికి అని. అయితే రవితేజ అంటే ఎలాగూ ఎంటర్ టైన్ మెంట్..ఫన్ నే. కానీ అది చాలదన్నట్లు మళ్లీ బ్రహ్మీని వాడేసాడట. ఇటీవల పెద్ద సినిమాల్లో బ్రహ్మీని చూసి కాస్త గ్యాప్ వచ్చింది. సో, ఇప్పుడు బ్రహ్మీ ఫ్యాన్స్ కిక్ 2 కు వెళ్లిపోవడమే. హీరో పేరుతోనే అలరిస్తాడు బ్రహ్మీ. అంటే..ఆ సినిమాలో బ్రహ్మీ క్యారెక్టర్ పేరు..రవితేజ అంట. అంటే అక్కడి నుంచే కామెడీ స్టార్ట్ చేసేసారన్నమాట.