పాల్లేవు..పాల్లేవు..అంటూ ఒకటే గొడవచేస్తోంది రేష్మీ. తొలి సినిమాతో సరైన హిట్ అందుకోలేక, అవార్డుతో సంతృప్తి పడిన ప్రవీణ్ సత్తారు, బి సి సెంటర్లకు నచ్చే మాస్ సినిమా మీద లుక్కేసినట్లుంది ఈ సారి. అందుకే గుంటూరు టాకీస్ అంటూ ఓ సినిమా మొదలెట్టాడు.
శ్రద్ధాదాస్, రేష్మీ వంటి తారలను తీసుకున్నాడు. కాస్త డిఫరెంట్ గా సినిమాను జనాల్లోకి పంపాలని కిందా మీదా అవుతున్నాడు. అందులో భాగంగా ఓ మేకింగ్ విడియో విడుదల చేసాడు.అందులో రేష్మీ..పదే పదే పాల్లేవు..పాలు లేవు.పాల్లేవు..అంటూ తెగ హడావుడి చేసింది.
విజయపాలు, అమూలు పాలు అన్నట్లుగా, ఈ రేష్మీ పాలు గొడవేమిటో? పైగా పదే పదే పాల్లేవు..పాల్లేవు అంటూ చివర్న నాతోనే చెప్పిస్తారేమిటి అంటోంది డైరక్టర్ తో డైరక్ట్ గా. అసలే ఈ ఏ పాలో..రేష్మీ దగ్గర పాల్లేకపోవడం ఏమిటో? సినిమా వస్తేకానీ తెలియదేమో?