విజయ్ పులి ట్రయిలర్ వచ్చింది. ఓ ఫాంటసీ సినిమాకు కావాల్సిన హంగులన్నీ వున్నట్లే కనిపిస్తున్నాయి. కేవలం భారీతనం, ఎమోషన్ మీద మాత్రమే కాకుండా, పిల్లలకు, కామన్ ఆడియన్స్ కు నచ్చే అంశాలు అన్నీ చొప్పించాలన్న తాపత్రయం కనిపించింది ట్రయిలర్ లో.
అయితే విజయ్ సంగతి, టెక్నికల్ హంగుల సంగతి అలా వుంచితే, శ్రీదేవిని మాత్రం రాణిగా చూడడం కాస్త కష్టంగానే వుంది. అందునా బాహుబలిలో బొద్దుగా, నిండుగా రమ్యకృష్ణను చూసిన తరువాత శ్రీదేవిని చూస్తుంటే రాణి డ్రెస్ లో వున్న పరిచారికలావుంది తప్ప వేరు కాదు.
టీజర్ కన్నా కొత్తగా ఇందులో విజయ్ ను చూపించలేదు. విజయ్ ను చూపించే కన్నా, సినిమాలో వున్న అంశాలు చూపించడానికే ప్రాధాన్యత ఇచ్చారు. అదిబాగుంది. కాస్త ఇంట్రెస్టింగానే వుండేలా వుంది సినిమా.