అలా ఎలా కాపీ కొట్టేశారో

‘గబ్బర్‌సింగ్‌’ తెలుగు తెరపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ‘ఆగడు’ సంచలనం సృష్టించడానికి రానుంది. కానీ, ఈ రెండు సినిమాల్లోనూ పోలికల్ని వెతికేస్తున్నారు సినీ అభిమానులు. పవన్‌ హీరోగా ‘గబ్బర్‌సింగ్‌’ వస్తే, మహేష్‌ హీరోగా…

‘గబ్బర్‌సింగ్‌’ తెలుగు తెరపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ‘ఆగడు’ సంచలనం సృష్టించడానికి రానుంది. కానీ, ఈ రెండు సినిమాల్లోనూ పోలికల్ని వెతికేస్తున్నారు సినీ అభిమానులు. పవన్‌ హీరోగా ‘గబ్బర్‌సింగ్‌’ వస్తే, మహేష్‌ హీరోగా ‘ఆగడు’ వస్తోంది. ‘గబ్బర్‌సింగ్‌’ హిందీ ‘దబాంగ్‌’కి రీమేక్‌ కాగా, ‘ఆగడు’ స్ట్రెయిట్‌ మూవీ.

ఇక, ‘గబ్బర్‌సింగ్‌’ సినిమాతో పవర్‌ఫుల్‌ పోలీస్‌గానూ, అదే సమయంలో బోల్డంత ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచుతూ పవన్‌ అలరించాడు. ‘ఆగడు’ సినిమా కూడా అదే ఫ్లేవర్‌లో తెరకెక్కినట్లు కన్పిస్తోంది. అయితే, అచ్చంగా ‘గబ్బర్‌సింగ్‌’ని శ్రీనువైట్ల కాపీ కొట్టేశాడన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

‘గబ్బర్‌సింగ్‌’లో పోలీస్‌ స్టేషన్‌ గేట్‌ ముందు కారు మీద కూర్చుని పవన్‌, అలీతో చెప్పే డైలాగ్‌లానే మహేష్‌ కూడా ‘ఆగడు’లో ఓ డైలాగ్‌ చెప్పేస్తున్నాడు. అదొక్కటే కాదు, చాలా సన్నివేశాలు ‘గబ్బర్‌సింగ్‌’ని పోలి వున్నాయి. దాంతో సినీ అభిమానులు ‘ఇవీ కంపేరిజన్స్‌’ అంటూ వీడియోలోని ఫొటోల్ని కట్‌ చేసి నెట్‌లో పోస్ట్‌ చేస్తున్నారు.

‘అలా ఎలా కాపీ కొట్టేశారు..’ అని మహేష్‌ అభిమానులు కూడా ఆందోళన చెందాల్సి వస్తోంది. ఇంకా వచ్చింది టీజరే గనుక.. ‘ఆగడు’ సినిమా విడుదలైతేనేగానీ.. ‘గబ్బర్‌సింగ్‌’తో ‘ఆగడు’కి కంటెంట్‌ వైజ్‌గా పోలిక వుందో లేదో తెలియదు. అప్పటిదాకా మహేష్‌ అభిమానులకి టెన్షనే.