నచ్చినోడి కోసం హీరోయిన్లు మతం మార్చుకోవడం అనేది ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. ఆ మధ్య నయనతార మతం మార్చుకుని హిందూ మతాన్ని స్వీకరించడం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. అయితే ప్రభుదేవా కోసం మతం మార్చుకున్నా, ప్రభుదేవాతో నయన లవ్ ఎఫైర్ చెడిరదనుకోండి.. అది వేరే విషయం.
ఇటీవలే అమలాపాల్ కూడా మతం మార్చుకుందంటూ కథనాలు విన్పిస్తున్నాయి. ఆమె కూడా దర్శకుడు విజయ్‌తో ప్రేమలో పడి, అతన్ని పెళ్ళాడనుంది. అమల కోరిక మేరకు చర్చ్‌లోనూ, విజయ్ కోరిక మేరకు హిందూ దేవాలయంలోనూ వీరిద్దరి పెళ్ళీ జరగనుంది.
ఇక తాజాగా తమిళ హీరోయిన్ మౌనిక కూడా మతం మార్చుకుంది. ఆమె ఇస్లాం మతం పుచ్చుకుంది. ఎందుకు.? అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. ‘నా ఇష్ట ప్రకారం ఇస్లాంలోకి మారాను..’ అని చెబుతోంది మౌనిక. తెలుగులో జగపతిబాబు నటించిన ‘శివరామరాజు’ సినిమాలో చెల్లెలి పాత్రలో నటించిన మౌనిక, అల్లరి నరేష్‌తో ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించింది కూడా.
మౌనిక, తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడేందుకే మతం మార్చుకుందన్నది కోలీవుడ్ వర్గాల్లో విన్పిస్తోన్న గాసిప్. మౌనిక మాత్రం ఈ ఊహాగానాల్ని కొట్టి పారేస్తోంది.