ప్రభాకర్ ను వెనక్కు తోసిన డబ్బింగ్ సినిమా

ఈటీవీ ప్రభాకర్ గా పేరు తెచ్చుకున్న నటుడు కమ్ డైరక్టర్ ప్రభాకర్ కు ఓ డబ్బింగ్ సినిమా అడ్డం పడిందట. ఆయన బ్రహ్మాండంగా ఓ కథ తయారుచేసుకుని, మాంచి ముహూర్తం చూసుకుని గీతా కాంపౌండ్…

ఈటీవీ ప్రభాకర్ గా పేరు తెచ్చుకున్న నటుడు కమ్ డైరక్టర్ ప్రభాకర్ కు ఓ డబ్బింగ్ సినిమా అడ్డం పడిందట. ఆయన బ్రహ్మాండంగా ఓ కథ తయారుచేసుకుని, మాంచి ముహూర్తం చూసుకుని గీతా కాంపౌండ్ లో అడుగు పెడ్డాడట. బాగానే వుందని, అడ్వాన్స్ అందించారు. డిస్కషన్లు నడుస్తున్నాయి.

ఇంతలో ఓ డబ్బింగ్ హర్రర్ సినిమా విడుదలైంది. ఆంధ్ర నుంచి సొమ్ములు నొల్లేసింది. తీరా చూస్తే, ప్రభాకర్ కథ ఆ సినిమాకు కాస్త దగ్గరగా వుందని వినికిడి. దాంతో, ఆ కథను పక్కన పెట్టి మళ్లీ కొత్త కథ చేసే పనిలో పడ్డాడట. ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తోందట ఆ కథ,.