కొత్తవాళ్లు, చిన్న సినిమాలు అంటే కేరాఫ్ అడ్రస్ దిల్ రాజు. అలాంటి దిల్ రాజు మరీ చిన్న సినిమాలు అటెంప్ట్ చేయకూడదు అనుకుంటున్నాడని వినికిడి. ప్రేక్షకులను చిన్న సినిమాలు ఆడే థియేటర్లకు రప్పించాలంటే చాలా కష్టపడాల్సి వస్తోంది.
అదే పెద్ద సినిమాలైతే వాళ్లంతట వాళ్లే వస్తున్నారు. అందుకే ఇక చిన్న సినిమాలకు స్వస్తి చెప్పి, మీడియం, భారీ సినిమాలు మాత్రమే తీయాలనుకుంటున్నాడట. ఇప్పుడు సునీల్, సాయి ధరమ్ తేజ లతో కృష్ణాష్టమి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలు చేసు్తున్నాడు.
ఈ రెండూ మీడియం రేంజ్ సినిమాలే. త్వరలో రవితేజతో భారీ సినిమా చేస్తాడని తెలుస్తోంది. ప్రేక్షకులు చిన్న సినిమాలకు స్పందించడం కాస్త ఆలస్యమవుతోందని, అభిరుచిగల నిర్మాతలు ఇలా నిర్ణయాలు తీసుకుంటే, మంచి చిన్న సినిమాలు ఇక రావడం కష్టం.