వైట్లకి కౌంటరేసిన కోన

కోన వెంకట్‌, శ్రీను వైట్ల మధ్య సంబంధాలు చెడ్డాయనేది తెలిసిందే. బాద్‌షా టైమ్‌లో ఇద్దరి మధ్య వచ్చిన విబేధాల వల్ల శ్రీను వైట్ల ‘ఆగడు’కి తన రచయితల్ని మార్చేసాడు. అప్పుడే శ్రీను వైట్ల గురించి…

కోన వెంకట్‌, శ్రీను వైట్ల మధ్య సంబంధాలు చెడ్డాయనేది తెలిసిందే. బాద్‌షా టైమ్‌లో ఇద్దరి మధ్య వచ్చిన విబేధాల వల్ల శ్రీను వైట్ల ‘ఆగడు’కి తన రచయితల్ని మార్చేసాడు. అప్పుడే శ్రీను వైట్ల గురించి కోన వెంకట్‌ బాగా ఫైర్‌ అయ్యాడు. రచయితల క్రెడిట్‌ కొట్టేయాలని చూస్తాడని మండి పడ్డాడు.

తాజాగా శ్రీను వైట్లపై కోన వెంకట్‌ మరో వ్యంగాస్త్రం సంధించాడు. ‘ఆగడు’ టీజర్‌లో ఇతర హీరోల మీద సెటైర్‌ వేయించిన శ్రీను వైట్ల గురించి కోన ఒక ట్వీటేసాడు. ‘‘కొంతమంది సొంత పని పక్కన పెట్టి పక్కన వాళ్ల మీద ఎక్కువ ఫోకస్‌ పెడుతుంటారు. త్వరగా అవుట్‌ ఫోకస్‌ అయిపోయేది కూడా వీళ్లే’’ అంటూ వైట్లని ఉద్దేశించి కామెంట్‌ చేసాడు. 

తన కామెంట్‌లో ఎక్కడా వైట్ల ప్రస్తావన లేకపోయినప్పటికీ ఈజీగా దీనిని డీకోడ్‌ చేయగలిగారు. ఇంతవరకు మహేష్‌ కానీ, శ్రీను వైట్ల కానీ ఈ డైలాగ్‌పై జరుగుతున్న రచ్చ గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ ఆగడు టీజర్‌ మాత్రం ఈ డైలాగ్‌ కారణంగా పెద్ద డిస్కషన్‌ టాపిక్‌ అయి కూర్చుంది.