గ్రీన్ సిగ్నల్ సినిమాకు నెగిటివ్ రివ్యూలు రావడం కూడా వరంగా వుంది ఆ సినిమా నిర్మాత ఆనందంగా వున్నారట. ఇలాంటి సినిమాలు చూసే సెక్షన్ అంటూ ఒకటి వుంటుంది. ఇంతలా బూతు వుందా అని థియేటర్ కు వస్తున్నారని ఆనందపడుతున్నారని వినికిడి. మూడు కోట్ల వరకు ఖర్చయిన ఈ సినిమాకు ఎనభై లక్షలు శాటిలైట్ వచ్చింది.
జిల్లాకు పదిలక్షలు వచ్చినా గట్టేక్కేయచ్చని అంటున్నారట. వీకెండ్ కావడం శనివారం ఫరవాలేదనిపించే కలెక్షన్లు వచ్చాయట. ఆదివారం ఇలాగే వుంటే కాస్త సేఫ్ అయిపోతామని వారు భావిస్తున్నారు.
నిజానికి ఈ సినిమా ఏ ఒక్క ఏరియాకు అమ్ముడుపోలేదు. ఈస్ట్, విశాఖకు కాస్త అడ్వాన్స్ లు మాత్రం వచ్చాయి. బూతు మాట పక్కన పెడితే సినిమా కనీసం చూడబుల్ గా లేకపోవడం అతి పెద్ద మైనస్. మరి శని ఆదివారాలతో ఆగుతుందో, నిర్మాత గట్టెక్కుతారో చూడాలి.