పులి లీక్ అయ్యిందా?

అత్తారింటికి దారేది, బాహుబలి లీకుల బారిన పడిన సినిమాలే. ఇప్పుడు ఇదే సమస్య తమిళ సినిమా పులికి కూడా వచ్చిందని వార్తలు గుప్పుమన్నాయి. విజయ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా ఇది. Advertisement చాలా…

అత్తారింటికి దారేది, బాహుబలి లీకుల బారిన పడిన సినిమాలే. ఇప్పుడు ఇదే సమస్య తమిళ సినిమా పులికి కూడా వచ్చిందని వార్తలు గుప్పుమన్నాయి. విజయ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా ఇది.

చాలా కాలం తరువాత శ్రీదేవి ఈ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన 18 నిమషాలు పుటేజ్ లీక్ అయిందని సాయంత్రం నుంచి వార్తలు గుప్పు మన్నాయి. అయితే ఇది సినిమా పుటేజ్ కాదని, కథ గురించి వివరంగా విడియో తీసి లీక్ చేసారని కూడా వినిపిస్తోంది. ఈ సినిమా ఫాంటసీ జోనర్ లో తయారవుతోందని తెలుస్తోంది.

వర్తమానం నుంచి గతంలోకి వెళ్తుందని వినికిడి. అలా వెళ్లిన తరువాత విజయ్ ఎవరో కాదు శ్రీదేవి కొడుకు అని తెలుస్తుంది అని కథ సారాంశం.ఏమైనా పెద్ద సినిమాలకు ఈ లీకుల బాధలు తప్పడం లేదు.