అత్తారింటికి దారేది, బాహుబలి లీకుల బారిన పడిన సినిమాలే. ఇప్పుడు ఇదే సమస్య తమిళ సినిమా పులికి కూడా వచ్చిందని వార్తలు గుప్పుమన్నాయి. విజయ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా ఇది.
చాలా కాలం తరువాత శ్రీదేవి ఈ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన 18 నిమషాలు పుటేజ్ లీక్ అయిందని సాయంత్రం నుంచి వార్తలు గుప్పు మన్నాయి. అయితే ఇది సినిమా పుటేజ్ కాదని, కథ గురించి వివరంగా విడియో తీసి లీక్ చేసారని కూడా వినిపిస్తోంది. ఈ సినిమా ఫాంటసీ జోనర్ లో తయారవుతోందని తెలుస్తోంది.
వర్తమానం నుంచి గతంలోకి వెళ్తుందని వినికిడి. అలా వెళ్లిన తరువాత విజయ్ ఎవరో కాదు శ్రీదేవి కొడుకు అని తెలుస్తుంది అని కథ సారాంశం.ఏమైనా పెద్ద సినిమాలకు ఈ లీకుల బాధలు తప్పడం లేదు.