‘ఆగడు’ పంచ్‌ పడింది

సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజునాడు ఆయన తనయుడు టాలీవుడ్‌ నయా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కొత్త సినిమా ‘ఆగడు’ టీజర్‌ని విడుదల చేశారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ‘దూకుడు’ తర్వాత శ్రీనువైట్ల ` మహేష్‌ కాంబినేషన్‌లో…

సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజునాడు ఆయన తనయుడు టాలీవుడ్‌ నయా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కొత్త సినిమా ‘ఆగడు’ టీజర్‌ని విడుదల చేశారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ‘దూకుడు’ తర్వాత శ్రీనువైట్ల ` మహేష్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆగడు’పై భారీ అంచనాలే నెలకొన్నాయి.

‘ఆగడు’ టీజర్‌ అభిమానుల్ని కొత్త ఉత్సాహంలో ముంచెత్తుతోంది. మళ్ళీ మహేష్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కన్పిస్తుండడంతో అభిమానులు సినిమా ఘనవిజయం సాధించడం ఖాయమనీ, టాలీవుడ్‌ రికార్డుల్ని ‘ఆగడు’ తిరగరాస్తుందనీ నమ్ముతున్నారు.

‘సినిమాల ప్రభావం సమాజంపై ఎంతుందో తెల్దుగానీ, పంచ్‌ డైలాగ్‌ల ప్రభావం గట్టిగానే వుంది’ అనే డైలాగ్‌తోపాటు, ‘ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపేరిజన్స్‌.. ఎలపరం వచ్చేస్తోంది..’ అనే డైలాగ్స్‌కి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. ‘పంచ్‌’ డైలాగులు ఎవరి మీద విసిరారో, సినిమాలో సీనెంతో.. కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.