ఇది పక్కా..దాదాపుగా ఫైనల్. కొరటాల శివ తరువాతి సినిమా ఎన్టీఆర్ తో లేనట్లే అని తెలుస్తోంది. కొరటాల తరువాతి సినిమా నిర్మాత డివివి దానయ్యకు కమిట్ అయి వున్నాడని వినికిడి. దానయ్య ఈ సినిమాను బన్నీతో తీయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
పైగా శ్రీమంతుడు సినిమా విడుదలకు ముందు నుంచే బన్నీ ఓ సినిమాను కొరటాల డైరక్షన్ లో చేయాలనుకుంటున్నాడు. సో, బన్నీ డేట్లు దానయ్య దగ్గర వున్నాయి, దానయ్య అడ్వాన్స్ కొరటాల దగ్గర వుంది. అందువల్ల ఇక ఈ కాంబినేషన్ సెట్ కావడానికే ఎక్కువ అవకాశాలు వున్నాయి.
మైత్రీ మూవీస్ వాళ్లు ఇటు ఎన్టీఆర్ కు, అటు పవన్ కు అడ్వాన్స్ లు ఇచ్చి వున్నారు. వాళ్లకు ఇప్పుడు ఇమ్మీడియట్ గా దొరికేది ఎన్టీఆరే. మరి శివ లేకుంటే ఆ సినిమాను ఏ దర్శకుడికి అప్పగిస్తారో చూడాలి మరి.