21 రాత్రి చరణ్ సినిమా టీజర్

ఎప్పుడు ఎప్పుడా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న రామ్ చరణ్ – శ్రీను వైట్ల సినిమా టీజర్ 21 అర్థరాత్రి విడుదల చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చరణ్ సినిమా టీజర్…

ఎప్పుడు ఎప్పుడా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న రామ్ చరణ్ – శ్రీను వైట్ల సినిమా టీజర్ 21 అర్థరాత్రి విడుదల చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చరణ్ సినిమా టీజర్ విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే టీజర్ రెడీ అయిపోయింది. టీజర్ చాలా సూపర్ గా వచ్చిందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. టీజర్ తోనే సినిమాపై అంచనాలు రెట్టింపైపోతాయని, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రామ్ చరణ్ సినిమా ఏ రేంజ్ లో వుంటుందో, టీజర్ తోనే తెలుస్తుందని యూనిట్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

చాన్నాళ్ల తరువాత శ్రీను వైట్లతో కోనవెంకట్ బృందం ఈ సినిమాకు పని చేస్తోంది. దాంతో అటు ఓవర్ సీస్ లోనూ, ఇటు డొమెస్టిక్ మార్కెట్ లోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.