మేరిల్యాండ్:వారధి తమ మూడవ వసంతపు వాకిట అడుగెట్టిన సంధర్భంగా ఇక్కడి High Point High school నందు భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలు నభూతో న భవిష్యతి అన్న రీతిలో జనరంజకంగా సాగాయి. ప్రఖ్యాత “మా వూరి వంట ” TV Fame శ్యామల గారు వ్యాఖ్యాతగా సుమారుగా 2000 మందికి పైగా విచ్చేసిన ఈ వేడుకలలో శ్రీ చిత్ర గారు, శ్రీ SP శైలజగారు,విజయ్ ఫ్రకాష్ మరియు శ్రీ క్రిష్ణ గారిల Live Orchestra ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.
Unify Solutions అధినేత సతీమణి శ్రీదేవిగారు, Paradise Indian Cuisine ,Baltimore ,MD అధినేత సతీమణి కళ్యాణి వన్నెం రెడ్డి గారు,KrishNa Training IT అధినేత వినూత్న గ్రంధి గారితోపాటు చైర్మెన్ చంద్ర ఈడెం ,ప్రెసిడెంట్ చంద్ర కాటుబోయిన గారి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ అద్వితీయ కార్యక్రమానికి తండొప తండాలుగ వీక్షకులు తరలిరావడం విశేషం .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా Maryland State Senator James C. Rosapepe ,Howard County Executive Allan Kittleman విచ్చేసి తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సంగీత భరిత నృత్యకార్యక్రమాలతో మొదలుకొని నవరసభరిత నాట్యాలతో చిన్నారుల సిం హనాదలతో తరుణీమణుల ఫ్యాషన్ షో మొదలగు విన్నూతన కార్యక్రామాలతో ఆద్యంతం సభికులను ఉర్రూతలూగించాయి.
ఈ వేడుకలకు ప్రదాన దాతలుగా Unify Solutions,Paradise Indian Cuisine,MD,Krishna Training IT,C-HIT,Sun properties Icore Infotech లతో పాటు సుమారు మరొ 28 మంది దాతలు స్పాన్సర్లుగా వ్యవహరించారు.వారిలో ఒకరైన Paradise Indian Cuisine,Baltimore,MD వారు అందించిన పసందైన కమ్మటి పంచభక్ష పరమాన్నాల గురించి వేన్నోళ్ళ కొనియాడడం విశేషం. భోజనాల పిదప Live Orchesthraకై ఎదురు చూస్తూ ఇసుకేస్తే రాలనంత జనంతో సభా ప్రాంగణమంతా కిటకిటలాడడం వారధివారిని సంభ్రమాశ్చ్యర్యాలకు గురి చేసింది . శ్రీ చిత్ర , SP శైలజ వారి బృందానికి ప్రేక్షకుల తమ మిన్ను ముట్టే కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. అద్భుతమైన గాత్ర సౌందర్యాన్ని నిలువెత్తు ఆపాదించుకున్న చిత్ర గారి శ్రావ్య గీతాల లహరిలో మైమరిచిపోవడం,విజయ్ ప్రకాష్ గారి శివహోం పాటతో ఒక్కసారిగా జన ప్రభంజనమంతా ఉత్తేజితులై ఆకాశమే హద్దుగా ఆనందసాగరంలో ఓలలాడడం చివరగా విజయ్ ప్రకాష్ గారు తన జయహో పాటతో ప్రేక్షకులను సమ్మోహితులను చేసి తారాస్థాయికి తీసికెల్లడంతో Live Orchesthraకు తెర పడింది.ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడి తెలుగు ప్రజలకు అందజేస్తున్న వారధి వారిని అభినందిస్తూ గాయక బృందం సెలవు తీసుకున్నారు.
ఈ భారీ వేడుకలను అత్యంత ప్రణాళికా బద్ధంగా నిర్వహించిన వారధి కార్య నిర్వాహకులను వారి క్రమ శిక్షణను, అకుంఠిత దీక్షను పలువురు కొనియాడడం మరో విశేషం. చివరగా వందన సమర్పణ పిదప గాయకుల జాతీయ గీతాలాపనతో వారధి ఉగాది వేడుకలు ఘనంగా ముగిశాయి.