ఇటీవల ఎక్కడ చూసినా కెమెరాలే.. ఎవ్వరికీ ప్రైవసీ లేదు. ఎక్కడో చోట మనల్ని ఎవరో ఒకరు క్యాప్చర్ చేస్తూనే ఉంటారు. ఆఖరికి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, షాపుల్లో మన చర్యలు నిక్లిప్తమైపోతాయి. అవన్నీ ఓకే. మేం బస చేసే హోటల్స్‌లో రహస్యకెమెరాలుంటాయేమోనని భయం నాకూ ఉంది అని చెబుతుంది అని చెబుతుంది హీరోయిన్ సంజన.
ఎప్పుడో ప్రభాస్ సరసన ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నై’ చిత్రంలో నటించిన సంజన గొప్ప హీరోయిన్ కాలేకపోయినా చేసిన కొన్న సినిమాల్లోనే మంచి పేరు తెచ్చుకుంది. సినిమాల కోసం హోటల్స్‌లో బస చెయ్యక తప్పదు. ఇటీవల కొంతమంది హీరోయిన్స్‌ని బాత్రూంలో చిత్రీకరించి సోషల్ నెట్‌వర్క్‌లో పెట్టి అల్లరిపాలు చెయ్యడం పట్ల అందరికీ భయం పట్టుకుంది.
ముఖ్యంగా అలాంటివి ఉన్నాయేమో అని అణువణువునా గాలించాలి. ఆ తర్వాతే మన పనులు కానిచ్చుకోవాలి. సాధారణంగా స్టార్ హోటల్స్ ఆ పని చెయ్యవు. కొంతమంది సిబ్బంది అలాంటివాటికి పాల్పడతారు. కెమేరాలుంటే పసిగట్లే యాప్ ఒకటుంది. దాన్ని ఉపయోగించి చాలా వరకూ అలాంటి వాటి నుండి బయటపడొచ్చంటుంది సంజన.