రిలీజ్ కమిట్ మెంట్లు ఎంతవరకు?

దాదాపు సినిమాలు అన్నీ కీలకమైన పరిస్థితుల్లో వున్నాయి. చకచకా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఆదీ ముందుగా విడుదల తేదీలు ప్రకటిస్తున్నాయి. ఈ దసరాకు వరుణ్ తేజ కంచె, రామ్ శివం, రామ్ చరణ్ సినిమా, బెంగాల్…

దాదాపు సినిమాలు అన్నీ కీలకమైన పరిస్థితుల్లో వున్నాయి. చకచకా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఆదీ ముందుగా విడుదల తేదీలు ప్రకటిస్తున్నాయి. ఈ దసరాకు వరుణ్ తేజ కంచె, రామ్ శివం, రామ్ చరణ్ సినిమా, బెంగాల్ టైగర్, పులి (విజయ్), మంచు విష్ణు డైనమేట్ , నిఖిల్, శంకరాభరణం,అంతకు కాస్త ముందుగా సెప్టెంబర్ లో భలేభలేమగాడివోయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, రుద్రమదేవి, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలు రెడీ అవుతున్నాయి.

అంటే ఒక విధంగా ఫుల్ టైట్ అండ్ ఫుల్ వార్ అన్నమాట. నిజానికి ఈ సమ్మర్ ను కూడా ముందుగా అలాగే అనుకున్నారు. కానీ కిక్ 2, బాహుబలి, రుద్రమదేవి, శ్రీమంతుడు అన్నీ సమ్మర్ కు వస్తాయని చెప్పి, డుమ్మా కొట్టినవే. మరి దసరాకు వస్తాం అని ముందుగా రుమాళ్లు వేస్తున్న సినిమాల్లో ఎన్ని వస్తాయో, ఎన్ని డుమ్మా కొట్టి, మళ్లీ దీపావళికి వాయిదా పడతాయో మరి చూడాలి.