మే 15కు హెవీ డిమాండ్

చూస్తూ వుంటే మే 15వ తేదీన కాస్త ఓ రేంజ్ సినిమాలు ఢీకొనేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ పండగ చేస్కో, కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న రవితేజ కిక్ 2 రెండూ…

చూస్తూ వుంటే మే 15వ తేదీన కాస్త ఓ రేంజ్ సినిమాలు ఢీకొనేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ పండగ చేస్కో, కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న రవితేజ కిక్ 2 రెండూ ఆ రోజే విడుదలవుతున్నాయి. ముందు కిక్ 2 మే 7 అని అన్నారు కానీ, మళ్లీ వారం వెనక్కు వెళ్లినట్లు తెలుస్తోంది.

మే 1న లయన్ వుంటే దానికి వెసులుబాటుగా వుంటుదని కిక్ 2 ను వెనక్కు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు లయిన్ కూడా ఒక వారం వెనక్కువెళ్లేలా వుంది. డిటీఎస్ పనుల్లో జాప్యం వల్ల. 

ఇదిలా వుంటే అజిత్ ఎంతవాడు కానీ సినిమా కూడా అదే రోజు విడుదలయ్యే అవకాశం వుందంటున్నారు. ఈ మధ్యలో డబ్బింగ్ సినిమా తింగరి కూడా సీన్ లోకి వస్తోంది.  మొత్తానికి మే 15 డిమాండ్ బాగానే వున్నట్లుంది.