మారుతి కథతో దిల్ రాజు సినిమా

దర్శకుడు మారుతి కథ, స్క్రీన్ ప్లే తో నిర్మాత దిల్ రాజు సినిమా చేయబోతున్నారు. మారుతి చెప్పిన ఓ లైన్ నచ్చడంతో, ఆయన దాన్ని సినిమాగా మార్చడానికి ముందుకు వచ్చారు. దీంతోమారుతి ఆ లైన్ ను…

దర్శకుడు మారుతి కథ, స్క్రీన్ ప్లే తో నిర్మాత దిల్ రాజు సినిమా చేయబోతున్నారు. మారుతి చెప్పిన ఓ లైన్ నచ్చడంతో, ఆయన దాన్ని సినిమాగా మార్చడానికి ముందుకు వచ్చారు. దీంతోమారుతి ఆ లైన్ ను డెవలప్ చేసి, కథ, స్క్రీన్ ప్లే తయారుచేసారు.

చంద్రశేఖర్ యేలేటి దగ్గర సహాయకుడిగా పనిచేసిన ఓ యువకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. కొత్త హీరోను ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నంలో వున్నారు. హీరోయిన్ మాత్రం, దృశ్యం చిత్రంలో నటించిన కృత్తిక.

పైగా ఇటీవల్ దిల్ రాజు కేరింత సినిమాలో నటించి పేరు తెచ్చుకున్న 'నూకరాజు' ఈ సినిమాలో కూడా ఓ మాంచి క్యారెక్టర్ చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో మంచి ఔట్ పుట్ ఇచ్చే సినిమాటోగ్రాఫర్ బాల్ రెడ్డి ఈ సినిమాకు పని చేస్తున్నారు.