సక్సెస్‌ కోసం ‘షార్ట్‌’ కట్‌..

రొటీన్‌ సినిమాలతో బండి లాగడం కష్టమని తెలుగు సినీ పరిశ్రమకి కూడా తెలిసి వస్తోంది. రొటీన్‌ సినిమాల్లో ఏది ప్రేక్షకులని అలరిస్తుందో, ఏది పల్టీ కొడుతుందో అంచనా వేయడం అసాధ్యమైపోయింది. అందుకే రొటీన్‌ సినిమాల…

రొటీన్‌ సినిమాలతో బండి లాగడం కష్టమని తెలుగు సినీ పరిశ్రమకి కూడా తెలిసి వస్తోంది. రొటీన్‌ సినిమాల్లో ఏది ప్రేక్షకులని అలరిస్తుందో, ఏది పల్టీ కొడుతుందో అంచనా వేయడం అసాధ్యమైపోయింది. అందుకే రొటీన్‌ సినిమాల కంటే వెరైటీకి పెద్ద పీట వేసి తక్కువ బడ్జెట్‌లో సినిమాలు చేయాలనేది ఇప్పుడు ఇండస్ట్రీ గట్టిగా నమ్ముతోంది. 

షార్ట్‌ ఫిలింస్‌ తీసే వారి నుంచి చాలా మంది టాలెంట్‌ ఉన్న దర్శకులు పరిశ్రమకి పరిచయం కావడంతో కొత్త టాలెంట్‌ని పట్టడానికి ఇదే షార్ట్‌ కట్‌ అని చాలా మందికి జ్ఞానోదయం అయింది. ఇప్పటికే పూరి జగన్నాథ్‌, మంచు విష్ణు టాలెంట్‌ హంట్‌ మొదలుపెట్టారు. ఈమధ్య నాసి రకం సినిమాలు చేస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్న సందీప్‌ కిషన్‌ కూడా టాలెంట్‌ ఉన్న షార్ట్‌ ఫిలిం మేకర్స్‌ని రమ్మంటున్నాడు. 

అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ ఐడియాస్‌తో వచ్చి మెప్పించినట్టయితే వారికి సినిమాకి డైరెక్ట్‌ చేసే అవకాశం కల్పిస్తానని సందీప్‌ కిషన్‌ పేర్కొన్నాడు. వీరనే కాదు… చాలా మంది సక్సెస్‌ సాధించడానికి, కొత్త టాలెంట్‌ని కనిపెట్టడానికి ఇదే రైట్‌ రూట్‌ అనుకుంటున్నారు. మరి ఈ హంట్స్‌ వల్ల ఎంత మంది కొత్త దర్శకులు మన పరిశ్రమకి వస్తారనేది చూడాలి.