ఇలియానా చీటీ చిరిగింది!

తెలుగు చిత్ర సీమలో అగ్ర పథంలో దూసుకుపోతున్న టైమ్‌లో ఇలియానా కొందరితో పేచీలు పెట్టుకుంది. శక్తి చిత్రం రిలీజ్‌ అయిన వారం రోజుల్లోనే దానిని బ్యాడ్‌ ఫిలిం అంటూ కామెంట్‌ చేసి టాలీవుడ్‌ నిర్మాతల…

తెలుగు చిత్ర సీమలో అగ్ర పథంలో దూసుకుపోతున్న టైమ్‌లో ఇలియానా కొందరితో పేచీలు పెట్టుకుంది. శక్తి చిత్రం రిలీజ్‌ అయిన వారం రోజుల్లోనే దానిని బ్యాడ్‌ ఫిలిం అంటూ కామెంట్‌ చేసి టాలీవుడ్‌ నిర్మాతల బ్యాడ్‌ బుక్స్‌లోకి చేరింది. జులాయితో ఎంకరేజ్‌ చేసిన త్రివిక్రమ్‌ని కూడా ప్రమోషన్‌ కార్యక్రమాలకి రాకుండా ఇరిటేట్‌ చేసింది. 

బాలీవుడ్‌లో ‘బర్ఫీ’ చిత్రంతో ఘన స్వాగతం లభించడంతో ఇక అక్కడ సెటిల్‌ అయిపోయానని అనుకుంది. ఆ తర్వాత కొన్ని చెప్పుకోతగ్గ చిత్రాల్లోనే నటించిన ఇలియానాకి ఇప్పుడు ఒక్క ఆఫర్‌ కూడా చేతిలో లేదు. ఆమె లాస్ట్‌ రిలీజ్‌ ‘హ్యాపీ ఎండింగ్‌’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. షారుక్‌, సల్మాన్‌ సరసన వస్తాయని అనుకున్న అవకాశాలు ఇంతదాకా ఆమె చేతికి రాలేదు. 

అటు హిందీలో ఆఫర్లు రాక… ఇటు దక్షిణాదిలో పిలిచే వాళ్లు లేక ఇలియానా కెరీర్‌కి ప్రస్తుతానికి పాజ్‌ పడింది. తొందర్లో ఏదైనా అవకాశం వస్తే మళ్లీ ఆమె జర్నీ ముందుకెళుతుంది కానీ లేదంటే టోటల్‌గా సెలవు తీసుకుని తన విదేశీ బాయ్‌ఫ్రెండ్‌తో సెటిలైపోవాల్సి వస్తుంది.