హైద్రాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. ఉద్యోగ నిమిత్తం ఆఫీస్‌కి వెళ్ళిన తన భార్య కన్పించడంలేదని కూకట్‌పల్లిలో ఫిర్యాదు చేశాడు కార్తీక్ అనే వ్యక్తి. కార్తీక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిన్న ఉదయం కార్తీక్ భార్య భవ్యశ్రీ క్యాబ్‌లో ఆఫీస్‌కి వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే రెగ్యులర్‌గా వెళ్ళే క్యాబ్ దొరక్కపోవడంతో, ఆమె ప్రైవేటు క్యాబ్‌లో వెళ్ళినట్లుగా తనకు చివరి మెసేజ్ ఆమెనుంచి అందిందని కార్తీక్ చెబుతున్నాడు.
రెండున్నరేళ్ళ క్రితం కార్తీక్, భవ్యల వివాహం జరిగిందనీ, వీరిది ప్రేమ వివాహమనీ తెలుస్తోంది. భవ్యశ్రీ స్వస్థలం విజయవాడ. నిన్న ఉదయం నుంచీ సాయంత్రం వరకు భవ్యశ్రీ నుంచి ఫోన్ రాలేదనీ, తాను ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదనీ.. అనుమానం వచ్చి, సన్నిహితులతో గాలించినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నాడు భవ్యశ్రీ భర్త కార్తీక్.
భవ్యశ్రీని ఎవరైనా కిడ్నాప్ చేసి వుంటారా.? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. హైద్రాబాద్‌లో మహిళలపై అఘాయిత్యాలు కలవరపెడ్తున్నాయి గత కొంతకాలంగా. మహిళల రక్షణ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఈ తరమా ఘటనలు పెరుగుతుండడం దురదృష్టకరం.