నితిన్‌ నాట్‌ హ్యాపీ

చాలా కథలు విన్న తర్వాత, మొదలు పెట్టిన సినిమాల్ని ఆపేసిన తర్వాత నితిన్‌ ఇప్పుడు కరుణాకరన్‌ సినిమా చేస్తున్నాడంటే… తనకి నచ్చే కథ రెడీ అయిందని అనుకుంటుండవచ్చు. అయితే మరీ లేట్‌ అయిపోతోందనే ఉద్దేశంతోనే…

చాలా కథలు విన్న తర్వాత, మొదలు పెట్టిన సినిమాల్ని ఆపేసిన తర్వాత నితిన్‌ ఇప్పుడు కరుణాకరన్‌ సినిమా చేస్తున్నాడంటే… తనకి నచ్చే కథ రెడీ అయిందని అనుకుంటుండవచ్చు. అయితే మరీ లేట్‌ అయిపోతోందనే ఉద్దేశంతోనే పూర్తిగా తనకి నచ్చేట్టు కథ సిద్ధం కాకపోయినా నితిన్‌ ముందుకి కదిలిపోయాడట. 

సినిమా స్టార్ట్‌ అయ్యాక కూడా మార్పు చేర్పులు చేసుకుందామని డిసైడ్‌ చేసాడట. తను మంచి ఫామ్‌లో ఉండగా ఏడాదికి ఒకటే సినిమా చేయగలగడం వల్ల నితిన్‌ చాలా నష్టపోతున్నాడు. అందుకే వేగంగా సినిమాలు చేద్దామంటే తనకి నచ్చిన కథలు దొరకడం లేదు. కరుణాకరన్‌ కూడా ఈ సినిమా కథపై చాలా కాలంగా కూర్చున్నాడు. 

ఇంకా అది నితిన్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ నచ్చేట్టుగా రూపొందకపోయినా… సెవెంటీ పర్సెంట్‌ శాటిస్‌ఫై అయ్యాడు కనుక పచ్చ జెండా ఊపేసాడట. మరి సినిమా పూర్తయ్యేలోగా కరుణాకరన్‌ ఈ చిత్రాన్ని నితిన్‌కి వంద శాతం నచ్చేట్టు తీస్తాడో లేదా తనకి చెప్పిన దాంట్లోనే సగం తీసిస్తాడో చూడాల్సిందే.