ఎన్ని థియేటర్లు అందుబాటులో ఉంటే అన్ని చోట్ల సినిమాని విడుదల చేసేసి వీలయినన్ని తక్కువ రోజుల్లో వీలయినంత వసూలు చేయడం ఇప్పటి ట్రెండు. అన్ని భాషల్లోను ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. పైరసీని తట్టుకోవాలన్నా… టాక్ తేడాగా వస్తే త్వరగా బయటపడాలన్నా ఇదే దారి అని నమ్ముతున్నారు.
కానీ నాగార్జున మాత్రం ‘మనం’ విషయంలో దీనికి విరుద్ధంగా వెళుతున్నాడు. మనం చిత్రాన్ని చాలా తక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నాడు. టాక్‌ని బట్టి థియేటర్లు పెంచడానికి, లాంగ్ రన్ ఉండడానికి వీలుగా చూసుకుంటున్నాడు. ఇది ఈమధ్య అస్సలు వర్కవుట్ కాని స్ట్రాటజీ.
లాంగ్ రన్ అనేది దాదాపుగా అసాధ్యమని తేలిపోయింది. అలాగే రెండవ వారం నుంచి పైరసీని తట్టుకోవడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో మనం చిత్రం ట్రెండుకి విరుద్ధంగా వెళ్లి ఎంతవరకు లాభపడుతుందనేది చూడాలి. ఒకవేళ ఈ స్ట్రాటజీతో నాగ్ క్లిక్ అయినట్టయితే మరోసారి తక్కువ థియేటర్లలో విడుదల చేసే ట్రెండ్ స్టార్ట్ అవుతుంది.