గ్రేటాంధ్ర చెప్పిందే నిజమైంది

గబ్బర్ సింగ్ 2 పేరును సర్దార్ గా మార్చిన తరువాత వచ్చిన ప్రెస్ నోట్ చూసి ఓ అనుమానం వ్యక్తం చేసాం..గబ్బర్ సింగ్ 2 పేరు సర్దార్  గా మార్చారా లేక, సర్దార్ గబ్బర్…

గబ్బర్ సింగ్ 2 పేరును సర్దార్ గా మార్చిన తరువాత వచ్చిన ప్రెస్ నోట్ చూసి ఓ అనుమానం వ్యక్తం చేసాం..గబ్బర్ సింగ్ 2 పేరు సర్దార్  గా మార్చారా లేక, సర్దార్ గబ్బర్ సింగ్ గా మార్చారా అని? కానీ ఇప్పటి దాకా సర్దార్ అనే పేరు చలామణీలో వుంటూ వచ్చింది.

ఇప్పుడు తొలిసారి ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో ఆ సందేహం తీరిపోయింది. సినిమా పేరు సర్దార్ గబ్బర్ సింగ్ అని స్పష్టమైంది. సర్దార్ పాపారాయుడు మాదిరిగా సర్దార్ గబ్బర్ సింగ్ అన్నమాట. 

సర్దార్ పదానికి చాలా చరిత్ర వుంది. సర్దార్జీ అన్న పలుకుబడి వుంది. అధపతి అనే గౌరవార్థం వస్తుంది దానికి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అటు భారతీయులకు, ఇటు భాజపా జనానికి ఆరాధ్యుడు.

నిజాం నుంచి తెలంగాణ చెర విడపించింది ఆయనే. భాజపాతో మమేకం అయిన పవన్ ఈ పేరు ఎంచుకోవడం బాగానే వుంది. పైగా సర్దార్ భగత్ సింగ్ అన్న సౌండ్ వస్తుంది. పైగా ఇక్కడ గబ్బర్ సింగ్ హీరోనే కదా.  

మన రాష్ట్రంలో  స్వాతంత్ర్య సమర యోధుడు గౌతు లచ్చన్నకు సర్దార్ బిరుదు వుంది. మొత్తానికి గబ్బర్ సింగ్ 2 అనే పేరు కన్నా ఇధే బాగుంది. సర్దార్ అని వుంటే గబ్బర్ సింగ్ సీక్వెల్ అన్న ఫీలింగ్ రాదు. అదే సర్దార్ గబ్బర్ సింగ్ అని వుంటే ఆ ఫీలింగూ వస్తుంది. కొత్తగానూ వుంటుంది. మొత్తానికి పవర్ స్టార్ సినిమాకు మంచి టైటిలే సమకూరింది.