సినీ రంగంలో రాణించడానికి ఎవరికైనా లౌక్యం చాలా అవసరం. ముఖ్యంగా ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చే హీరోయిన్లు ఇక్కడ నిర్మాతల్ని, హీరోల్ని మచ్చిక చేసుకుంటేనే అవకాశాలొస్తాయి. ఇది బాగా తెలిసిన హీరోయిన్లకి సక్సెస్‌లు పెద్దగా లేకపోయినా అవకాశాలు వచ్చి పడుతుంటాయి. లౌక్యం లేని వాళ్లు పూర్తిగా సక్సెస్ మీద డిపెండ్ అవ్వాల్సిందే.
తమన్నానే తీసుకుంటే ఆమెకి తెలుగు చిత్ర పరిశ్రమలో విజయాలు ఎక్కువ లేవు. అయినప్పటికీ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో బాహుబలి, ఆగడులాంటి భారీ చిత్రాలున్నాయి. సక్సెస్ లేకపోయినా తమన్నాకి ఇన్ని అవకాశాలెందుకు వస్తున్నాయంటే… ఆమెకి ఇక్కడ ఎలా మసలుకోవాలో బాగా తెలుసు. తమన్నాకి ఉన్న తెలివితేటలు మిగతా హీరోయిన్లకి లేవు.
సమంతనే తీసుకోండి… చూస్తూ చూస్తూ మహేష్‌బాబుని ఎవరైనా హర్ట్ చేస్తారా చెప్పండి. అతని సినిమా పోస్టర్‌పై కామెంట్ చేసి మహేష్ రాంగ్ బుక్స్‌లోకి ఎక్కింది. శృతిహాసన్ కూడా ఎవడులోని తన ఫోటోలు లీక్ అయ్యాయంటూ కేస్ పెట్టింది. తమన్నా ఇలాంటి కాంట్రవర్సీలకి దూరంగా ఉండడమే కాదు.. తన సినిమాల పబ్లిసిటీకి ఫుల్ టైమ్ కేటాయిస్తూ మార్కులు కొట్టేస్తుంది.