రాజకీయ నాయకులు మాట తప్పడం మామూలే. కానీ సినిమా నటులు కూడా మాట తప్పడం అంటే ఏమనుకోవాలి. నాగ్ ఇటీవల వెబ్ మీడియాకు ఇంటర్వూలు ఇచ్చినపుడు మనం ప్రీమియర్ షో కేవలం అభిమానులకు, సినిమా వారికి, మీడియాకు వేస్తున్నట్లు చెప్పారు. తీరా తరువాత విచారిస్తే, మీడియాకు లేదని సమాచారం.
అదేమని పీఆర్వోని అడిగితే నాగ్ కు తెలియకుండా చెప్పేసారు. మీడియాకు లేదని సమాధానం. అదేంటి..నాగ్ సినిమా, నాగ్ కు తెలియకుండానే, మీడియాకు వుందని చెప్పేసారా? ఇదెక్కడి చిత్రం? అంతేనా? సినిమా వాళ్లు చూస్తే చాలు, అనవసరంగా మీడియా ముందుగా చూసేసి, సమీక్షలు నెట్ లో పెట్టేస్తే లేని పోని ఇబ్బంది అని అనుకున్నారా? అయినా సినిమా బాగున్నా, బాగులేకున్నా ఎంతకాలం దాచగలరు. మహాఅయితే కొన్నిగంటలేగా..అయినా నాగ్ కూడా ఇలా చేయడం ఏమిటో?