బాలీవుడ్‌లో హిట్టు ఖాయమట

తెలుగులో ‘మిరపకాయ్‌’ సినిమాలో నటించినా, ఆ సినిమా హిట్‌ క్రెడిట్‌ని పొందలేదు పొడుగు సుందరి దీక్షా సేథ్‌. తమిళంలోనూ ఆమెకు పరాజయాలే ఎదురయ్యాయి. అయినాసరే.. పట్టు వదలకుండా హిట్టు కోసం దీక్షాసేథ్‌ ప్రయత్నిస్తూనే వుంది…

తెలుగులో ‘మిరపకాయ్‌’ సినిమాలో నటించినా, ఆ సినిమా హిట్‌ క్రెడిట్‌ని పొందలేదు పొడుగు సుందరి దీక్షా సేథ్‌. తమిళంలోనూ ఆమెకు పరాజయాలే ఎదురయ్యాయి. అయినాసరే.. పట్టు వదలకుండా హిట్టు కోసం దీక్షాసేథ్‌ ప్రయత్నిస్తూనే వుంది సౌత్‌లో.

‘నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా.. సక్సెస్‌ ఎప్పుడో ఒకప్పుడు దొరక్కుండా పోతుందా.?’ అని ఆశాభావంతో తన పని తాను చేసుకుపోతోన్న దీక్షాసేథ్‌, బాలీవుడ్‌లోనూ ఇప్పుడిప్పుడే అవకాశాలు సంపాదించుకుంటోంది. తన తాజా బాలీవుడ్‌ చిత్రం ‘లేకర్‌ హమ్‌ దివానా దిల్‌’ సినిమాపై దీక్షాసేథ్‌ చాలా ఆశలే పెట్టుకుంది.

‘లేకర్‌ హమ్‌ దివానా దిల్‌’ సినిమాలో తనకు మంచి పాత్ర దక్కిందనీ, సినిమా విడుదలయ్యాక అందరూ తన గురించి మాట్లాడుకుంటారనీ దీక్షాసేథ్‌ చెప్పుకొచ్చింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో. తొలి బాలీవుడ్‌ సినిమా ఘనవిజయం సాధిస్తుందనీ, హీరోయిన్‌గా తనకు మంచి గుర్తింపునిస్తుందనీ ఆశాభావం వ్యక్తం చేస్తోన్న దీక్షకి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో వేచి చూడాలి.