ఒక గంట సేపు డాన్స్ చేసి పోతే మూడు కోట్లు ఇస్తామని ఎవరైనా ఆఫరిస్తే వదులుకోవడానికి ఎవరికైనా మనసు రాదు. కానీ కంగన రనౌత్ మాత్రం తనకంటూ కొన్ని విలువలు ఉన్నాయని అంటోంది. తనకి ఓ పెళ్లిలో డాన్స్ చేయడానికి మూడు కోట్లు ఆఫరిస్తే సింపుల్‌గా నో అనేసింది.
అంత పెద్ద మొత్తం కదా అని ఒక్కసారి కూడా ఆమె టెంప్ట్ కాలేదట. ఫిగర్ చెప్పినా కానీ మేనేజర్‌తో ‘చేసేది లేదు’ అని మాత్రం చెప్పిందట. క్వీన్ సక్సెస్‌తో కంగన డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పుడు ఆమెతో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయించుకునే క్రేజ్ బాగా పెరిగింది. కానీ కంగన మాత్రం సినిమాలతో తప్ప మరో దారిలో సంపాదించను అంటోంది.
పెళ్లిళ్లలో డాన్సులు చేయడానికి తనేమీ రికార్డ్ డాన్సులు చేసే దానిని కాదని.. సినిమా ఆర్టిస్ట్‌నని.. సినిమాల్లో ఏ పాత్రలైనా చేస్తున్నామని… ఏదైనా చేసేస్తామని అనుకోవడం తగదని చెప్పింది. షారుక్ ఖాన్‌లాంటి వాడు కూడా ఇలాంటి ఛాన్సులు మిస్ కాని రోజుల్లో కంగన లాంటోళ్లు ఉండడం విశేషమే.