మహేష్‌తో వేగంగా ఒక సినిమా తీసేసి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తానని పూరి జగన్నాథ్ ఒక డీల్‌తో వెళ్లాడు. మహేష్ దానికి ఓకే అన్నాడు కానీ తనకున్న వేరే కమిట్‌మెంట్స్ వల్ల అతను వెంటనే పూరి సినిమాకి డేట్స్ ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు పూరి వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ఎన్టీఆర్ చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు.
పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ హీరోగా రూపొందే చిత్రాన్ని జనవరి 9న విడుదల చేస్తారట. బండ్ల గణేష్ నిర్మించే ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడు. అంటే ఇది మహేష్‌తో పూరి తీద్దామని అనుకున్న సినిమా అయితే కాదు. పూరి తన సొంత కథతోనే మహేష్‌తో చేద్దామని ప్లాన్ చేసుకున్నాడు. కాకపోతే ఆ సినిమా చేద్దామనుకున్న డేట్స్‌లో ఎన్టీఆర్ చిత్రం సెట్స్ మీదకి వెళుతోందంతే.
ఇకపోతే ఎన్టీఆర్‌తో పూరి తీసిన ఏకైక చిత్రం ఆంధ్రావాలా ఫ్లాప్ అయింది. అది కూడా జనవరిలోనే విడుదల కావడం కాకతాళీయమో ఏమో కానీ… అప్పుడు చేసిన తప్పుని పూరి దిద్దుకుంటాడో లేక ఎన్టీఆర్ రిగ్రెట్ అయ్యేట్టు చేస్తాడో మరి?