శంకరాభరణంలో నిర్మాత

గీతాంజలి నిర్మాత ఎం వి వి సత్యనారాయణ. టాలీవుడ్ కు కొత్త కానీ విశాఖ ప్రాంతానికి కాదు. ఆ ప్రాంతంలో నెంబర్ వన్ బిల్డర్ కమ్ రియల్టర్. ఆ సంగతి అలా వుంచితే, కాస్త…

గీతాంజలి నిర్మాత ఎం వి వి సత్యనారాయణ. టాలీవుడ్ కు కొత్త కానీ విశాఖ ప్రాంతానికి కాదు. ఆ ప్రాంతంలో నెంబర్ వన్ బిల్డర్ కమ్ రియల్టర్. ఆ సంగతి అలా వుంచితే, కాస్త స్టయిల్ గా వుండడం, తన ఫొటోలు, ఫోజులు తన ప్రాజెక్టుల ప్రకటనల్లో వేసుకోవడం అలవాటు. ఇప్పుడు అదే అలవాటతో తన సినిమా లో కూడా నటించడానిక సిద్దమైపోయాడట. 

నిఖిల్ తో శంకరాభరణం సినిమా తీస్తున్నాడు ఆయన తన రెండో ప్రాజెక్టుగా. కోన వెంకట్ ఈ ప్రాజెక్టుకు సూత్రధారి ప్లస్ భాగస్వామి. నిర్మాత ఆసక్తి గమనించి, విలన్ బామ్మర్దిగా ఓ మంచి వేషం తయారుచేసి పెట్టాడట. దాంతో బిల్డర్ ఎంవివి ఇప్పుడు నిర్మాత నుంచి నటుడిగా ట్రాన్స్ ఫర్ అయ్యాడన్నమాట.