సినిమాను జడ్జ్ చేయడంలో దిల్ రాజు కు కాస్త టాలెంట్ వుంది. అందునా తక్కువ పెట్టుబడితో రిస్క్ లేని వ్యాపారం చేయడంలో ఆయన ఘనాపాఠి. తాజాగా కోటిరూపాయిలకు ఓ సినిమాను నైజాంకు కొనేసాడు. సినిమా చూపిస్తా మావా అనే సినిమా చూసి, స్పాట్ లో డెసిషన్ తీసుకుని, కోటి రూపాయలకు, అది కూడా నో రిటర్న్ బేసిస్ మీద నైజాంకు హక్కులు తీసేసుకున్నాడు.
నిర్మాత హ్యాపీ అన్న సంగతి పక్కన పెడితే, దిల్ రాజు కూడా హ్యాపీనే. ఎందుకంటే దిల్ రాజుకు వున్న ధియేటర్ నెట్ వర్క్ తో నైజాంలో, సినిమా యావరేజ్ అనిపించుకున్నా అంతకు అంతా వచ్చేస్తుంది. రాజ్ తరుణ్-అవికాగోర్ అంటే ఉయ్యాల జంపాల హిట్ ప్రభావం కొంతయినా వుంటుంది. అది చాలు దిల్ రాజు డబ్బులు చేసుకోవడానికి.